కరోనా వైరస్ అంటే ఏమిటి ?ఈ వైరస్ను శాస్త్రజ్ఞులు మైక్రోస్కోప్ లో చూచినప్పుడు అది కిరీటం ఆకృతిలో కనిపించింది. లాటిన్ భాషలో కరోనా అంటే కిరీటం అని అర్థం. అందుకే ఈ వైరస్ కు కరోనా వైరస్ అని పేరు పెట్టారు. ఇప్పటివరకు 6 రకాల వైరస్లు ఇదే తరహాలో వచ్చాయి. మొట్టమొదటిసారిగా 1960వ సంవత్సరంలో ఈ వైరస్ ను కనుగొన్నారు. సార్స్ మరియు మార్స్ అనేవి ఇందులో ముఖ్యమైనవి.కానీ వీటికి శాస్త్రజ్ఞులు మందులను కనిపెట్టగలిగారు. కానీ అవి ఎక్కువగా పక్షులు మరియు జంతువుల మీద ప్రభావం చూపించేవి.ముందుగా ఈ వైరస్ గబ్బిలాల నుండి మనుషులకు సోకినట్లు గా భావించారు. కానీ జర్నల్ ఆఫ్ మెడికల్ వైరాలజీ ఈ వైరస్ పాముల నుండి మనుషులకు వ్యాపించినట్లు చెబుతుంది.మరొకసారి ఈ కరోనా వైరస్ 2019 డిసెంబర్ 1తేదీన చైనాలోని ఊహాన్ నగరంలో గుర్తించబడింది. కానీ చైనీయులు 30 రోజులపాటు దానిని రహస్యంగా దాచి ఉంచి చివరికి డిసెంబర్ 31వ తేదీన 27 మందికి ఒక అదృశ్య వైరస్ కారణంగా నిమోనియా వ్యాధి సోకినట్లు గా ప్రపంచానికి వెల్లడించారు. ఇది అలా వ్యాప్తి చెంది ప్రపంచం మొత్తాన్ని చుట్టి భయభ్రాంతులను చేస్తుంది. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటోంది. ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. అమెరికా లాంటి అగ్ర రాజ్యాలను వణికిస్తోంది.


ఈ వైరస్ చాలా పెద్ద కుటుంబం కలది ఎక్కువగా జంతువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందేది. కానీ ఇప్పుడు మనుషుల మీద తన ప్రభావం మొదలుపెట్టింది. నీ వైరస్ కు మందు కనుగొనేందుకు శాస్త్రజ్ఞులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. మామూలు వైరస్ లను అయితే సాధారణంగా మూడు నాలుగు రోజుల తర్వాత మన శరీరం బయటకు పంప గలుగుతుంది. కానీ ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే శ్వాసకోశ వ్యవస్థ మీద ఎంతో ప్రభావం చూపించి ప్రాణాంతకంగా మారుతుంది.4 views0 comments

Recent Posts

See All